సత్యవరం, విశాఖపట్నం జిల్లా, పాయకరావుపేట మండలానికి చెందిన గ్రామము.[1]. ఇది తునికి మూడు కిలోమీటర్ల దూరంలో, తుని-పెంటకోట రోడ్డు మీద, దిగువున ఉన్న చిన్న గ్రామం. ప్రసిద్ధి చెందిన తుని తమలపాకులు ఈ సత్యవరంలోనూ, దగ్గర ఉన్న రామభద్రపురంలోనూ ఉన్న తోటలలోనే పెరిగేవి. ఈ వూరిలో గౌరి దేవి ఆలయము చాలా ప్రసిద్ధి. ఊరిలో గౌరి దేవి సంబరాలు మార్చి లేదాఫిబ్రవరిలో జరుగుతాయి. ఆ వేడుకలను ఘనంగా జరుపుతారు. సత్యవరం తమలపాకులకు ప్రసిధ్ది. ఇది మండల కేంద్రమైన పాయకరావుపేట నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1530 ఇళ్లతో, 5657 జనాభాతో 546 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2869, ఆడవారి సంఖ్య 2788. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 942 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586460[2].పిన్ కోడ్: 531127.
2011 నాటికి సత్యవరం గ్రామంలో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి?
Ground Truth Answers: 153015301530
Prediction: